రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా చేయాలని ఉంది.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-10-07 15:38:49.0  )
రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా చేయాలని ఉంది.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. తాజాగా ‘కంట్రోల్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అనన్య పాండే, విహాన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ నెట్‌ఫ్లిక్స్ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానే దర్శకత్వం వహించగా.. ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ప్రమోషన్స్ టైంలో అనన్య చేసిన కామెంట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘సంజయ్‌లీలా భన్సాలీ నాకు ఇష్టమైన డైరెక్టర్. ఆయన సినిమాల్లో చాన్స్ రావాలని కోరుకుంటున్న. కెరీర్ స్టార్టింగ్‌లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాను. రొమాంటిక్, హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలని ఉంది. అలాగే కరణ్ జోహర్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలనేది నా కోరిక. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘కాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో చిత్ర పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కానీ, ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed