ఇంత త్వరగా నా కల నెరవేరుతుందని ఊహించలేదు.. Wamiqa Gabbi

by Anjali |   ( Updated:2023-10-02 08:51:57.0  )
ఇంత త్వరగా నా కల నెరవేరుతుందని ఊహించలేదు.. Wamiqa Gabbi
X

దిశ, సినిమా: ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలోనే డ్రీమ్ రోల్‌లో నటించే అవకాశం అంత ఈజీగా ఎవరికీ రాదు అంటోంది వామికా గబ్బీ. ఈ మేరకు యంగ్ డైరెక్టర్ అట్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు రీసెంట్‌గా సైన్ చేసినట్లు వెల్లడించిన ఆమె.. ఇంత త్వరగా తనకు ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందని ఊహించలేదంటోంది. ‘అట్లీ గొప్ప డైరెక్టర్. యాక్షన్ అండ్ ఎమోషన్స్ రెండూ కలిపి తెరపై అద్భుతాలు చేయగలడు. అలాంటి దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో నేను ఇష్టపడే డ్రీమ్ క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా ఇలాంటి పెద్ద కమర్షియల్ మూవీలో ఛాన్స్ దొరుకుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నా కల నిజం కాబోతున్నందుకు హ్యాపీగా ఉంది’ అంటూ మురిసిపోయింది వామిక. ఇక ఈ సినిమాకు కలీస్ దర్శకత్వం వహించనుండగా అట్లీ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తుండటం విశేషం. కాగా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.


Advertisement

Next Story