VS13: లాంఛనంగా ప్రారంభమైన #VS13..

by sudharani |   ( Updated:2024-08-15 15:44:03.0  )
VS13: లాంఛనంగా ప్రారంభమైన #VS13..
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. అప్పుడే తన 13వ మూవీ ‘#VS13’ సిద్దం అయిపోయాడు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 8గా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రానికి డెబ్యుటెంట్ శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విశ్వక్ సేన్ హానెస్ట్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పోలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు గురువారం.. చిత్ర యూనిట్‌తో పాటు మరికొందరు ప్రత్యేక అతిధుల సమక్షంలో ‘#VS13’ లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు వశిష్ట క్లాప్‌ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. కాగా.. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ సంపద నటిస్తుంది.

Advertisement

Next Story