Vithika Seru: న్యూ బిగినింగ్ అంటూ వేరే నటుడితో వరుణ్ భార్య పోస్ట్.. రెండో పెళ్లా? అంటున్న నెటిజన్లు

by sudharani |
Vithika Seru: న్యూ బిగినింగ్ అంటూ వేరే నటుడితో వరుణ్ భార్య పోస్ట్.. రెండో పెళ్లా? అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: వితిక శేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ప్రేమించే రోజుల్లో, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇస్క్ కాదల్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. సహా నటుడు వరుణ్ సందేశ్‌ను 2015లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈమె.. 2019లో బిగ్ బాస్ తెలుగు- 3కి భర్తతో ఎంట్రీ ఇచ్చింది. ఇక వరుణ్ సందేశ్ ఇంట్లో ఉండగానే.. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వితిక.. అప్పటినుంచి ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ ట్రోల్స్‌కు గురవుతోంది.

తాజాగా వితిక శేరు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నటుడు శివకుమార్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటో ఫేర్ చేస్తూ ‘న్యూ బిగినింగ్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అయితే.. ఈ పోస్ట్ వితిక ఏదో కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేసినట్లు ఉన్నప్పిటికీ.. పూర్తిగా డిటైల్స్ ఇవ్వకపోవడంతో.. ప్రజెంట్ ఇది ట్రోల్స్‌కు గురవుతుంది. ‘న్యూ బిగినింగ్ అంటున్నావు.. రెండో పెళ్లి చేసుకుంటున్నావా’ అని కొందరూ మెసేజ్ చేస్తున్నారు. అయితే.. వితిక ఫ్యాన్స్ మాత్రం.. ‘సో మచ్ ఎగ్జైటెడ్’ అని కొత్త ప్రాజెక్ట్ గురించి ఈగర్‌గా ఎదురు చూస్తున్నట్లు తెలుపుతున్నారు.

Advertisement

Next Story