Vishwak Sen: విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ నుంచి అప్‌డేట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

by sudharani |   ( Updated:2024-07-26 15:11:49.0  )
Vishwak Sen: విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ నుంచి అప్‌డేట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్నాడు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ‘మెకానిక్ రాకీ’ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇందులో భాగంగా.. తాజాగా గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు జూలై 28న గ్లింప్స్‌ని లాంచ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మాస్ హీరో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు.

Read more...

డివోష‌న‌ల్ థ్రిల్లర్.. ఆది ‘షణ్ముఖ’ నుంచి పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్

Advertisement

Next Story