దీపావళికి 'ధమ్కీ' ఇస్తానంటోన్న విశ్వక్ సేన్..

by Hamsa |   ( Updated:2022-09-03 04:46:43.0  )
దీపావళికి ధమ్కీ ఇస్తానంటోన్న విశ్వక్ సేన్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ 'పాగల్' సినిమాతో ఇండస్టీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల 'అశోకవనంలో అర్జున కళ్యాణం' తో అలరించాడు. తాజాగా, విశ్వక్ సేన్ 'ధమ్కీ' సినిమాను తానే స్వయంగా డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నాడు.

ఇందులో నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్‌ను విశ్వక్ సేన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. '' దాస్ కా 'ధమ్కీ' 5 భాషల్లో రిలీజ్ కానుంది. యాక్షన్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ పోస్టర్ దీపావళీకి వస్తుంది'' అంటూ రాసుకొచ్చాడు. దీంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read : మొట్టమొదటి సారిగా సితారతో కలిసి టీవీ షోలో కనిపించనున్న Mahesh Babu

Advertisement

Next Story