ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తొలగించిన విశ్వక్ సేన్.. కారణం అదేనా!

by Hamsa |
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తొలగించిన విశ్వక్ సేన్.. కారణం అదేనా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఊహించని స్థాయిలో హిట్ అందుకోలేక పోయాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో తనను ట్రోల్ చేసేవారికి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. అయితే ఇటీవల విశ్వక్ యూట్యూబ్, సోషల్ మీడియాలో కల్కి సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చేవారిపై ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా ఓ యూట్యూబర్‌కు సవాల్ విసురుతూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. నెగిటివ్ రివ్యూ ఇవ్వడం కాదు.. దమ్ముంటే ఓ షార్ట్ ఫిలిం తీయమని ఛాలెంజ్ చేశాడు. దీంతో అతను కూడా రెచ్చిపోయి పోస్టులు పెట్టాడు. అయితే ఈ వివాదం రెండు మూడు రోజుల పాటు జరిగింది.

ఈ క్రమంలో.. తాజాగా, విశ్వక్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశాడు. సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్లు పోస్ట్ పెట్టి మరీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను పూర్తిగా తొలగించాడు. ఇక అది గమనించిన నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మా విశ్వక్ సేన్ అన్న ఇన్‌స్టాగ్రామ్ కనిపించడం లేదని ఉన్న మీమ్‌ను షేర్ చేస్తున్నారు. అలాగే ఆయన ఫ్యాన్స్ మాత్రం ప్లీజ్ విశ్వక్ అన్నా అకౌంట్ యాక్టివేట్ చేయి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే విశ్వక్ ఇటీవల కల్కి రివ్యూ విషయంలో జరిగిన ఇష్యూ వల్లనే ఇన్‌స్టా అకౌంట్ తొలగించినట్లు టాక్. అయితే మాస్ కా దాస్ ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్‌లోనే ఉంది. కానీ అందులోనూ పోస్టులు పెట్టకుండా పూర్తిగా సినిమా షూటింగ్స్‌లో బిజీ అయిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన విశ్వక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed