ఆ కారణంతోనే ‘లియో’ మూవీని రిజెక్ట్ చేశానంటున్న విశాల్

by Nagaya |   ( Updated:2023-09-16 10:21:03.0  )
ఆ కారణంతోనే ‘లియో’ మూవీని రిజెక్ట్ చేశానంటున్న విశాల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విశాల్ తాజాగా ‘మార్క్ ఆంటోనీ’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. దీంతో విశాల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమాలో నాకు ఒక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదు’ అని విశాల్ తెలిపారు. అయితే మరి ఎందుకు ఒప్పుకోలేదని అడగ్గా.. ‘నేను ఎప్పుడూ ఒకేసారి రెండు సినిమాలకు కమిట్ అవ్వను. ఎందుకంటే ఒక మూవీని ఒప్పుకొనక పూర్తి ద్యాసతో 100% ఆ సినిమాకు న్యాయం చేసే లాగే నేను పని చేస్తాను. కానీ ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటించే అలవాటు నాకు లేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు విశాల్.

Advertisement

Next Story