- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hero Rana: సమంతపై రానా చేసిన కామెంట్స్ వైరల్!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రానా ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’కు రీమేక్. కాగా కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ తెరకెక్కించారు. విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా హీరోయిన్ సమంత ఆరోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో మాములుగా సెలబ్రెటీలు వ్యక్తిగత విషయాలు పంచుకున్నప్పుడు.. ప్రేక్షకులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది? అని యాంకర్ అడగగా..‘ప్రతి ఒక్కరికి వారి స్వంత అభిప్రాయం ఉంటుంది. ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడతారు. కానీ, వారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయనేది ముఖ్యం. సమంత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే చాలా మందికి అది షాకింగ్ న్యూస్. నేను కూడా వెంటనే వెళ్లి ఆమెను కలిశాను. మేము ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయినప్పటికీ ఆమె ఇప్పుడున్న పరిస్థితి వేరు. తనకు నేను ఒక్కటే చెప్పాను. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎవరి జీవితం సాఫీగా ఉండదు. ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తుంది. అది ఆరోగ్య పరంగా కావచ్చు. మరో కారణం కావచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని చెప్పాను’ అంటూ రానా చెప్పుకొచ్చాడు.