ఆ హీరోను రేప్ చేస్తానన్న స్టార్ హీరోయిన్.. అసలు రహస్యం ఏమిటంటే?

by samatah |   ( Updated:2022-12-03 06:02:33.0  )
ఆ హీరోను రేప్ చేస్తానన్న స్టార్ హీరోయిన్.. అసలు రహస్యం ఏమిటంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : విలక్షణ నటుడు సత్య ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా సినిమాల్లో విలన్ పాత్రలో నటించి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక అప్పట్లో విలన్ పాత్రలు చేయాలంటే అందరికి ముందుగా గుర్తు వచ్చే పేరు సత్యప్రకాశ్‌నే, ముఖ్యంగా రేప్ సీన్లలో ఈయన ఎక్కువగా నటించేవారు.

ప్రస్తుతం ఈయన సినిమాలకు దూరమయ్యాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య ప్రకాశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేను ఎక్కువగా రేప్ సీన్లలో నటించేవాడిని, నాకు ఆ పాత్రలో నటించడం ఇష్టం లేకపోయినా నటించాల్సిన అవసరం వచ్చేది. ఇక ఆ రోజుల్లో ఆసీన్స్ ఎక్కువగా ఉండేవి, ప్రస్తుతం అలాంటి సీన్స్ ఇప్పుడు ఎవరూ ఎక్కువగా చూడటం లేదు అన్నారు.

అలాగే నేను పవిత్ర బంధంలో సౌందర్య‌తో కలిసి ఓ రేప్ సన్ని వేశంలో నటించాను. అది ఇప్పటికీ చాలా మందికి గుర్తు ఉంటుంది, అలాగే ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో రమ్య కృష్ణతో కలిసి రేప్ సీన్‌‌లో నటించాను, ఆ సన్ని వేశానికి చాలా టేక్స్ తీసుకున్నాను. అప్పుడు డైరెక్టర కాస్త ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో అప్పుడు రమ్య కృష్ణ మాట్లాడుతూ.. మీరు ఒకే అనండి సర్ నేను సత్య ప్రకాశ్‌ను రేప్ చేస్తాను అంది. దీంతో సెట్‌లో ఉన్నవారందరూ నవ్వరంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.


Also Read.......

" Love Today " సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

Advertisement

Next Story