తంగలాన్ సీక్వెల్ ప్రకటించిన విక్రమ్

by M.Rajitha |
తంగలాన్ సీక్వెల్ ప్రకటించిన విక్రమ్
X

దిశ, వెబ్ డెస్క్ : తన రీసెంట్ ఫిల్మ్ 'తంగలాన్' కు సీక్వెల్ ఉంటుందని కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన తంగలాన్ సక్సెస్ మీట్ వేడుకలో పాల్గొన్న విక్రమ్ మాట్లాడుతూ.. తాను నటించిన పొన్నియన్ సెల్వన్ 1 కు నాలుగు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మరో మంచి విషయం చెబుతున్నాను అంటూ.. తన రీసెంట్ చిత్రం తంగలాన్ కు సీక్వెల్ ఉంటుందని వెల్లడించాడు. పార్ట్ 2 గురించి దర్శక నిర్మాతలతో మాట్లాడనని, వీలైనంత త్వరగా మిగతా పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పా రంజిత్, నటి మాళవిక మోహనన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed