- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ ‘లియో’ కలెక్షన్లు ఫేక్.. తప్పు ఒప్పుకున్న డైరెక్టర్ ఏమన్నారంటే? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఎన్నో వివాదాలను ఎదర్కొని అక్టోబర్ 19న విడుదల మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఖైదీ, విక్రమ్ స్థాయిలో ఉంటుందని అంతా భావించారు. కానీ లియో మాత్రం ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. లియో కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ మేరకు ప్రొడక్షన్ కంపెనీ నుంచి లెక్కలు కూడా బయటకు వచ్చాయి. ఐదు వందల కోట్ల క్లబ్బులో లియో జాయిన్ అయిందని తెలిపారు.
ఈ క్రమంలో ‘లియో’ పేరిట ఫేక్ కలెక్షన్లను ప్రచారం చేస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా, కార్తీ జపాన్ మూవీ ఈవెంట్‌లో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. లియో ఫేక్ కలెక్షన్లు అని అంటున్నారు కదా? దీనిపై మీ కామెంట్ ఏంటి? అని మీడియా ప్రతినిధి లోకేష్‌ను అడిగేశాడు. దానికి ఆయన ‘‘ దీంతో నాకు పని లేదు నిర్మాతకు వదిలేస్తున్నాను. థియేటర్‌లో రెస్పాన్స్ చూశాను. మిక్డ్స్ రివ్యూలు వచ్చాయి. సెకండాఫ్ ల్యాగ్ ఉందని, బాగా లేదని అన్నారు. నేను దానిపై ఫోకస్ పెట్టాను అని ఇలా తన తప్పును ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.