విజయ్‌కాంత్ కన్నుమూత.. చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం

by GSrikanth |
విజయ్‌కాంత్ కన్నుమూత.. చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్, డీఎండీకే పార్టీ చీఫ్ విజయ్‌కాంత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన సినిమాలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

తాజాగా.. ఆయనకు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. అయితే, 27 ఏళ్ల వయసుల్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. 100 చిత్రాల్లో హీరోగా చేశారు. దాదాపు 20కి పైగా చిత్రాల్లో పోలీసు పాత్రల్లో నటించారు. విజయ్‌కాంత్ మరణవార్త తెలిసిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరుగబోతున్న సినిమా షూటింగ్స్‌ను నిలిపి వేయడంతో పాటు థియేటర్లలో ఆడుతున్న చిత్రాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed