- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మికకు బర్త్‌డే విష్ పోస్ట్ పెట్టని విజయ్.. నెట్టింట మరో కొత్త రచ్చ
దిశ, సినిమా: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. ‘యానిమల్’ మూవీతో బాలీవుడ్‌లో తన సత్తా చాటుకుంది. ప్రజెంట్ రష్మిక చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే నేడు రష్మిక పుట్టిన రోజు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ అందరూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంత మంది ఇన్‌స్టా వేదికగా స్టోరీస్ పెడుతున్నారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.
అయితే.. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. రష్మిక షేర్ చేసిన విషెస్ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా విజయ్ ఇన్‌స్టాలో కూడా ‘ఫ్యామిలీ స్టార్’ సంబంధించిన పోస్ట్ పెట్టుకున్నాడు కానీ రష్మికకు బర్త్‌డే విషెస్ మాత్రం చెప్పలేదు. దీంతో నెట్టింట కొత్త రచ్చ స్టార్ట్ అయింది. అయితే.. నిన్న రష్మిక పెట్టిన పోస్ట్‌లో, అలాగే విజయ్ షేర్ చేసిన వీడియోలో సేమ్ నెమలి ఉండటంతో ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు అనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి స్పెషల్‌గా పోస్ట్‌లు పెట్టాల్సిన అవసరం వచ్చి ఉండదు అంటూ నెట్టింట టాక్ నడుస్తోంది. అంతే కాకుండా దగ్గరుండి దూమ్ దామ్‌గా సెలబ్రేట్ చేసి ఉంటాడు విజయ్ అన్న అంటూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు.