తమన్నతో బయటకు వెళ్లడం నాకు నచ్చదు.. విజయ్ షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-08-19 12:16:10.0  )
తమన్నతో బయటకు వెళ్లడం నాకు నచ్చదు.. విజయ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : తమన్నతో లవ్ రిలేషన్‌పై విజయ్ వర్మ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కాగా తాజా ఇంటర్వ్యూలో ప్రేమయాణంపై మాట్లాడిన నటుడు.. ‘ఫ్యాన్స్ మెచ్చే జంటల్లో మేము కూడా ఉన్నామనే విషయం నాకు రీసెంట్‌గా తెలిసింది. నిజంగా ఇది నాకొక షాకింగ్ న్యూస్. అభిమానులు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మొదట్లో నేను ఇలా ఉండేవాడిని కాదు.

ప్రేమలో పడిన తర్వాత మేమిద్దరం కలిసి బయటకు వెళ్లినపుడు అందరి దృష్టి పడింది. మా పర్సనల్ లైఫ్ లైమ్‌లోకి జనాలు రావడంతో చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. కానీ కాలక్రమంలో అలవాటు పడుతున్నా’ అని చెప్పాడు. అలాగే ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో మనం హ్యాపీగా ఉంటామనే భావన కలగాలని, తమన్నతో ఉంటే తనకు అలాగే ఉంటుందన్నాడు. చివరగా తన ప్రేయసితో పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నానంటూ ముగించాడు విజయ్.

Advertisement

Next Story