- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ ‘కల్కి’లో విజయ్ దేవరకొండ.. ఏ పాత్రలో కనిపించనున్నాడంటే?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా ప్రాజెక్ట్‌లలో ‘కల్కి 2898AD’. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో.. దీపికా పదుకొణె హీరోయిన్ కాగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ మూవీపై భారీ హైప్‌ను పెంచగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సైతం నటించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ఇక విజయ్, దుల్కర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇందులో విజయ్ రోల్ మహాభారంలోని అర్జునుడి పాత్రని పోలివుంటుందని టాక్. అయితే ఇది కేవలం గెస్ట్ రోల్ అనుకుంటే మీ పొరపాటే.. పూర్తి నిడివి వున్న పాత్రలోనే కనిపించనున్నాడని.. అంతే కాకుండా విజయ్ పాత్ర ఈ మూవీలో చాలా కీలకంగానే వుంటుదని తెలుస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈ హీరో రోల్ కూడా పురాణాల నేపధ్యంలోనే వుంటుందని సమాచారం. మరి దీనిలో నిజం ఎంత ఉందో తెలియాలంటే.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.