అవును.. నా కొడుకుతో కొన్ని గొడవలున్నాయి: స్టార్ హీరో తండ్రి

by Hamsa |   ( Updated:2023-01-28 14:38:59.0  )
అవును.. నా కొడుకుతో కొన్ని గొడవలున్నాయి: స్టార్ హీరో తండ్రి
X

దిశ, సినిమా: తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి, తన తండ్రి చంద్రశేఖర్‌ మధ్య వివాదాల ఇష్యూ మరోసారి తెరపైకొచ్చింది. కొంతకాలంగా అన్నీ సద్దుమణిగినట్లే కనిపించినప్పటికీ వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని, మనస్పర్థలు అలాగే ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్పందించిన చంద్రశేఖర్.. 'నా కుమారుడితో గొడవలున్నాయి. ఇద్దరం ఏడాదిన్నరగా మాట్లాడుకోలేదు. కానీ, మా మధ్య వచ్చే గొడవలు అంత పెద్దవి కావు. మళ్లీ కలుసుకోవడం సహజమే. విజయ్‌కు నేనంటే చాలా ఇష్టం. నాతో క్లోజ్‌గా ఉంటాడు. సినిమాల తర్వాత విజయ్‌కే ప్రాధాన్యత ఇస్తా. ఆ తర్వాతే నా భార్య. తండ్రి కొడుకుల మధ్య మనస్పర్థలు రావడం సహజం. మేమిద్దరం గొడవలు పడతాం.. మళ్లీ కలుస్తాం. ఇదంతా కామన్. అందరం కలిసి ఇటీవలే 'వారిసు' చూశాం' అని పుకార్లకు చెక్ పెట్టాడు.

Advertisement

Next Story