లైగర్ ఫ్లాప్ విజయ్‌కు ముందే తెలుసు.. ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-07-06 05:51:39.0  )
లైగర్ ఫ్లాప్ విజయ్‌కు ముందే తెలుసు.. ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా సినిమా ‘బేబీ’. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘లైగర్’ రిజల్ట్ ఏంటో ఎర్లీ మార్నింగ్ షో తోనే అంతా అర్థం అయిపోయింది. ఇంకా ఈ సినిమాను జనాల మీదకి రుద్దాలి అనే ఇంటెన్షన్‌ను అన్న పక్కన పెట్టేశాడు. శారీరకంగా, మానసికంగా సినిమా కోసం ఎంత కష్ట పడ్డాం అని బాధపడటం మానేసి ఆగష్టు 25 సాయంత్రం నుంచే ‘ఖుషి’ సినిమా కోసం సిద్ధం అయ్యాడు. అన్న సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తన ఎఫర్ట్స్‌కు మాత్రం ఎవ్వరు వేలెత్తి చూపలేదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆనంద్ చేసిని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ‘బేబి’ సినిమా జూలై 14న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

Read More: ‘సలార్’ టీజర్ అనుకున్నంతగా ఏం లేదు.. అంటూ తేల్చేసిన నెటిజన్లు

Advertisement

Next Story