- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుక్ నుంచి యాక్టింగ్ ట్రిక్స్ నేర్చుకున్నా: Vicky Kaushal
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నుంచే తాను యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నానని యంగ్ హీరో విక్కీ కౌశల్ తెలిపాడు. ఆయన నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా 'గోవిందా నామ్ మేరా' డిసెంబర్ 16న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటుడు.. షారుఖ్ నుంచి నటనకు సంబంధించి వెరీ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ నేర్చుకున్నానని వెల్లడించాడు. అంతేకాదు 'ప్రతి సినిమాకు ఎప్పుడూ ఒక గ్రామర్ అటాచ్ అవుతుంది. అది దర్శకుడితోనే వస్తుంది. ఆ విజన్ ఒక పద్ధతిలో ఉంటుంది' అని షారుఖ్ చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. అయితే, సరిగ్గా షారుఖ్ చెప్పినట్లే 'గోవింద నామ్ మేరా' చిత్రంలో కొత్త గ్రామర్ అటాచ్ అయిందన్న విక్కీ.. ఈ సినిమా పెద్ద పరీక్షగా నిలిచిందని, మొదటి చిత్రంగా భావిస్తూ దర్శకుడి దృష్టికి లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. 'నిజంగా ఈ మూవీ గురించి చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నా' అంటూ ముగించాడు.
Read More: అది చూస్తే బాధగా అనిపించింది: రిచా కాంట్రవర్సీ ట్వీట్‌పై అక్షయ్
షారుఖ్‌తో మళ్లీ చిందులేయనున్న ప్రియమణి.. ఇదీ హిట్టేనా?