ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు.. సారాతో సినిమాపై Vicky Kaushal

by Prasanna |   ( Updated:2023-06-26 07:41:40.0  )
ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు.. సారాతో సినిమాపై Vicky Kaushal
X

దిశ, సినిమా: ‘జరా హాట్కే జరా బచ్కే’ ఊహించని విజయం సాధించడంపై విక్కీ కౌశల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విక్కీ, సారా జంటగా నటించిన ఈ మూవీ జూన్ ఫస్ట్ వీక్‌లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సాధారణ స్టోరినీ ప్రజలు ఆదరిస్తారో లేదోనని విడుదలకు ముందు మూవీ యూనిట్ మొత్తం భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. ‘ప్రజలు మాకు అవకాశం ఇస్తారో లేదో అనుకున్నాం. కానీ మొదటి రోజు రెస్పాన్స్ చూసి మేము ఆశ్చర్యపోయాం. భారీస్థాయిలో వస్తున్న సినిమాలే డిజాస్టర్ అవుతుంటే.. ఇండోర్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబం స్టోరీ ఎలా ఆకట్టుకుంటుందోననే డౌటు మమ్మల్ని భయపెట్టింది. మొత్తానికి ఎలాంటి యాక్షన్, కోలాహలం లేకపోయినా ఇంతటి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ విక్కీ పలు విషయాలను ప్రస్తావించాడు.

Advertisement

Next Story

Most Viewed