'మీకు ఆస్కార్‌ కాదు కదా.. భాస్కర్‌ అవార్డు కూడా రాదు'.. ఆ మూవీ మేకర్స్‌పై ఉమ్మేసింది

by Hajipasha |   ( Updated:2023-02-08 15:48:08.0  )
మీకు ఆస్కార్‌ కాదు కదా.. భాస్కర్‌ అవార్డు కూడా రాదు.. ఆ మూవీ మేకర్స్‌పై ఉమ్మేసింది
X

దిశ, సినిమా: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ చిత్రానికి ఆస్కార్ కాదు కదా.. భాస్కర్ అవార్డు కూడా రాదంటూ తనదైన స్టైల్‌లో విమర్శించాడు. విషయానికొస్తే.. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ (MBIFL 2023) ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఒకవైపు షారుఖ్ 'పఠాన్' మూవీని పొగిడేస్తూ 'ది కశ్మీర్‌ ఫైల్స్'ను దుయ్యబట్టాడు. ''పఠాన్'ను బ్యాన్ చేయాలన్న ఈ ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో.. ఇప్పుడా సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది.

ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని గోల చేసినవారే.. మోడీ సినిమాకు కనీసం రూ.30 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయారు. అలాంటివారు కేవలం మొరుగుతారంతే, కరవరు. జస్ట్ సౌండ్ పొల్యూషన్ మాత్రమే' అన్నాడు. అలాగే 'రీసెంట్‌గా వచ్చిన నాన్ సెన్స్ చిత్రాల్లో 'కశ్మీర్ ఫైల్స్' ఒకటి. దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేశారో మనందరికీ తెలుసు. చాలా సిగ్గుచేటు. ఇంటర్నేషనల్ జ్యూరీనే ఈ మూవీ మేకర్స్‌పై ఉమ్మేసింది. పైగా తనకు ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నాడు. నిజం చెప్తున్నా అతనికి 'భాస్కర్' అవార్డు కూడా రాదు. ప్రతిసారి జనాలను ఫూల్ చేయలేరు. నాకు తెలిసి ఇలాంటి సినిమాలు చేయడానికే వాళ్లు దాదాపు రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టారేమోననిపిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : ధనుష్ 'సార్' ట్రైలర్ డేట్ ఫిక్స్!

Advertisement

Next Story