Renu Desai: ‘ఇండియన్-2’ మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

by Hamsa |   ( Updated:2024-09-07 04:00:08.0  )
Renu Desai: ‘ఇండియన్-2’ మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ఇండియన్-2’. ఈ మూవీ ఇండియన్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్-2 మూవీ జూలై 12న భారీ అంచనాల నడుమ గ్రాండ్‌గా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టలేకపోవడంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా దీనిని తెరకెక్కించిన డైరెక్టర్ శంకర్‌పై ట్రోల్స్ కూడా చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, ఇండియన్-2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ పెట్ లవర్స్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన స్టైల్లో పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా అసలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారో అని ఫైర్ అయింది.

ఓ వీడియోను షేర్ చేసిన ఆమె ‘‘ఇండియన్ సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది డిజాస్టర్ కావాల్సిన మూవీనే. అసలు ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారు ఇలాంటి డైలాగ్స్. అసలు వాళ్ళకి ఏమైంది’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని షేర్ చేసింది. ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆ పోస్టును వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed