వర్మ జగన్.. ఒరిజినల్ జగన్ ఒకేలా ఉన్నారేంటి..? (వీడియో)

by sudharani |   ( Updated:2023-09-26 07:10:54.0  )
వర్మ జగన్.. ఒరిజినల్ జగన్ ఒకేలా ఉన్నారేంటి..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దివాంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ మహి.వి రాఘవ్ తెరకెక్కించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్ టాక్ సాధించింది. అయితే.. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘యాత్ర-2’ తీస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం జగన్ పాదయాత్ర, సీఎం పీఠం ఎక్కేవరకు సంఘటనలను యాత్ర-2లో చూపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన జగన్, జగన్ భార్య భారతి, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పోస్టర్లు ఆకట్టుకోగా.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియో లుక్ టెస్ట్‌కు సంబంధించిన విజువల్స్ అని అర్థం అవుతుండగా.. ఇందులో జగన్ పాత్రలో నటిస్తున్న జీవను చూస్తుంటే రియల్ జగన్‌ల అనిపించడం విశేషం. పాదయాత్ర టైంలో జగన్ ఎలా ఉండేవాడో అచ్చం అలాంటి పర్సనాలిటీతో జీవ సేమ్ టు సేమ్ కనిపించడం అందరికి ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వర్మ జగన్, ఒరిజినల్ జగన్ ఒకేలా ఉన్నారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story