Sunny Leone: సన్నీలియోన్ క్యూజీ తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ అందుకున్న వేణుగోపాల్

by Hamsa |   ( Updated:2024-08-19 14:27:41.0  )
Sunny Leone: సన్నీలియోన్ క్యూజీ తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ అందుకున్న వేణుగోపాల్
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సన్నీలియోన్, ప్రియమణి, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్యూజీ’. ఇందులో జాకీ షరఫ్, సారా అర్జున్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ వివేక్ కుమార్ కన్నన్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి మరో నిర్మాతగా గాయత్రి సురేష్ వ్యవహరించగా.. తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్‌ను సొంతం చేసుకొని నిర్మాత ఎం. వేణుగోపాల్ రుషి కేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎంతో హెవీ కాంపిటీషన్లో కూడా ఈ సినిమా తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మూవీ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాము. ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

Read More..

Kannappa: కన్నప్ప నుంచి కంపడు క్యారెక్టర్ రివీల్.. పోస్టర్‌తో అంచనాలను పెంచేస్తున్న మేకర్స్

Advertisement

Next Story