తెలుగు కమెడియన్ ఇంట్లో కుప్పలుగా రూ. రెండు వేల నోట్లు.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

by sudharani |
తెలుగు కమెడియన్ ఇంట్లో కుప్పలుగా రూ. రెండు వేల నోట్లు.. మంచు విష్ణు ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ గవర్నమెంట్ రూ.2వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై కొంతమంది తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే రూ.2వేల నోట్లను మే-23 నుంచి బ్యాంకులో మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే కమెడియన్ వెన్నెల కిషోర్ ఇంట్లో కుప్పలు, తెప్పలుగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు.. హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు.

ఈ మేరకు రూ.2 వేల నోట్ల కట్టల ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఫొటో తీసిన రూ. రెండు వేల నోట్ల కట్టలు ఇవి. ఇప్పుడు ఆయన వీటిని ఏం చేస్తాడో’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ట్వీట్ కాస్త వైరల్ కావడంతో కొంతమంది సరదాగా రియాక్ట్ అవుతుంటే.. తమ్ముడికి బర్త్‌డే విషెస్ చెప్పవు కానీ, కామెడీలు చేస్తున్నావా అంటూ విష్ణుపై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు మరికొందరు నెటిజన్లు..

Advertisement

Next Story