‘అలా మొదలైంది’.. అలీతో పోటీపడుతున్న వెన్నెల కిషోర్

by Hamsa |   ( Updated:2023-04-18 09:36:47.0  )
‘అలా మొదలైంది’.. అలీతో పోటీపడుతున్న వెన్నెల కిషోర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ కమెడియన్‌ అలీ హోస్ట్‌గా వ్యవహరించిన టాక్ షో ‘ఆలీతో సరదాగా’. చాలా సంవత్సరాలు ఈటీవీలో అద్భుతంగా నడిచింది. అయితే ఈ ‘అలితో సరదాగా’ షో ముగిసిన తర్వాత ETVలో ‘అలా మొదలైంది’ అనే కొత్త షో స్టార్ట్ అయింది. ఈ షోను ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్నారు. ఇది అతని మొదటి హోస్టింగ్ షో. గత కొన్ని వారాల క్రితం ప్రారంభమైన ఈ షోలో వంశీ పైడిపల్లి, నిఖిల్ సిద్ధార్థ్, రాజశేఖర్-జీవిత, మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే హోస్ట్‌గా వెన్నెల కిషోర్ బాగా చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. అలీతో పోలిస్తే వెన్నెల కిషోర్‌కు పెద్దగా అనుభవం లేదు. కానీ ఇప్పటికీ సినీ పరిశ్రమలోని చాలా మంది నటీనటులతో కిషోర్‌కి మంచి అనుబంధాలున్నాయి. వెన్నెల కిషోర్ కూడా తన అతిథులకు సౌకర్యంగా ఉండగలడా? వివాదాలతో సహా ఏదైనా మాట్లాడగలరా? అనేది అసక్తికరమైన అంశం.

ఇవి కూడా చదవండి: ‘శాకుంతలం’ డిజాస్టర్ అంతా కర్మ ఫలం అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్..

Advertisement

Next Story