రిలీజ్‌కు రెడీ అయిన 'Cheddi Gang తమాషా'!

by Hajipasha |
రిలీజ్‌కు రెడీ అయిన Cheddi Gang తమాషా!
X

దిశ, సినిమా: అబుజా ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ లీల ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రం 'చెడ్డి గ్యాంగ్ తమాషా'. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి రెండవ వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా టైటిల్, టీజర్‌ను ప్రముఖ నటుడు సునీల్ చేతుల మీదుగా లాంచ్ చేయించారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'మా చిత్ర టైటిల్ పోస్టర్‌ అనిల్ రావిపూడి, టైటిల్ టీజర్‌ సునీల్, టీజర్ నాగ్ అశ్విన్, ట్రైలర్‌ బ్రహ్మానందం రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపాడు. వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ హీరోహీయిన్లుగా నటించిన మూవీకి అర్జున్ సంగీతం అందించాడు.

READ MORE

క్యూరియాసిటీ పెంచేస్తున్న 'S.I.T.' ఫస్ట్ లుక్!

Next Story

Most Viewed