'పుష్ప పుష్ప'.. 'వేద' నుంచి వీడియో సాంగ్ రిలీజ్ చేసిన వివేక్ కూచిబొట్ల!

by sudharani |   ( Updated:2023-02-05 13:01:14.0  )
పుష్ప పుష్ప.. వేద నుంచి వీడియో సాంగ్ రిలీజ్ చేసిన వివేక్ కూచిబొట్ల!
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం 'వేద'. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న సినిమానుంచి తాజాగా నిర్మాత వివేక్ కూచిబోట్ల చేతులమీదుగా 'పుష్ప పుష్ప' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేయించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన ఈ చిత్ర దర్శకుడు ఎ. హర్ష.. డిసెంబర్ 23న కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులోనూ బిగ్ హిట్ కొడుతుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పాడు.

అంతేకాదు కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను వీకెండ్‌కు ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నామన్నారు. ఇక ఇప్పటికే మూవీకి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని, తమ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఈ చిత్ర బృందం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరగా సినిమా గురించి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ట్వీట్ చేస్తూ అభినందనలు తెలుపడం హ్యాపీగా ఉందన్నారు.

READ MORE

'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'.. ఫిబ్రవరి 18న వస్తున్న కామెడీ హారర్‌!

Advertisement

Next Story