రాబోయే తరానికి కాబోయే స్టార్ హీరో.. 'గని' స్పెషల్ గ్లింప్స్‌పై ఫ్యాన్స్

by Disha News Desk |

దిశ, సినిమా : కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'గని'. నేడు వరుణ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, పోస్టర్‌ రిలీజ్ చేయగా.. ఈ రోజు 'పవర్ ఆఫ్ గని' ట్యాగ్‌లైన్‌తో హీరోకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. వీడియో విషయానికొస్తే ఫైట్‌కు సిద్ధమవుతున్న వరుణ్.. కండల తిరిగిన దేహంతో యోధుడిలా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు.

కాగా ఈ తాజా లుక్స్‌పై స్పందిస్తున్న అభిమానులు.. 'రాబోయే తరానికి కాబోయే స్టార్ హీరో నువ్వే అన్నా..' అంటూ కామెంట్ చేస్తున్నారు. సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 మార్చిలో విడుదల కాబోతుండగా.. బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ వరుణ్ సరసన నటిస్తోంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed