Varun Tej ‘Gaandeevadhari Arjuna’ ట్విట్టర్ రివ్యూ

by sudharani |   ( Updated:2023-08-25 12:45:56.0  )
Varun Tej ‘Gaandeevadhari Arjuna’ ట్విట్టర్ రివ్యూ
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గాండీవధారి అర్జున’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మహా భారతం వంటి కథనాల ప్రకారం దేశాన్ని కాపాడే క్రమంలో గాండీవం చేపట్టిన అర్జునుడి పాత్రలో వరుణ్ నటించాడు.

‘గాండీవదారి’ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. ఈ రోజు (ఆగస్టు-25) సినిమా రిలీజ్ అయింది. ఇక ఇప్పటికే పలు చోట్ల షోలు పడటంతో టాక్ బయటకు వచ్చింది. ట్విట్టర్ రివ్యూ ప్రకారం.. సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఆకట్టుకుంటున్నప్పటికీ.. ఓవరల్ యాక్షన్ సీన్స్ ప్రతి చోట వర్కౌట్ కాలేదని ప్రజల అభిప్రాయం. ఫైనల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్దా ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంది.

Also Read: Kartikeya ‘Bedurulanka’ ట్విట్టర్ రివ్యూ

Advertisement

Next Story