వరుణ్ సందేశ్ న్యూ మూవీ టైటిల్ రివీల్..

by Vinod kumar |
వరుణ్ సందేశ్ న్యూ మూవీ టైటిల్ రివీల్..
X

దిశ, సినిమా: వరుణ్ సందేశ్ కథానాయకుడిగా ధనరాజ్, కాశీ విశ్వనాధ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘చిత్రం చూడర’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బీఎం సినిమాస్ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. కాగా, తాజాగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాధ్ నిందితులుగా పోలీస్ స్టేషన్‌లో కూర్చోవడం క్యురియాసిటీని పెంచుతోంది. అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ‘నేనింతే’ ఫేం అదితి గౌతమ్ ఐటెం సాంగ్‌తో అలరించనుంది.

Advertisement

Next Story