- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తరలివచ్చిన తారాలోకం.. ఫుల్ జోష్‌లో వరుణ్ లావణ్య రిసెప్షన్
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరీ ఇటలీలో నవంబర్ 1న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, కామినేని, లావణ్య ఫ్యామిలీ, అల్లు పలువురు ప్రముఖులు మాత్రమే హాజరైన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం హైదరాబాద్ కొంత జంట వచ్చేసింది. ఇక మెగా ఫ్యాన్స్ వరుణ్-లావణ్యకు గ్రాండ్‌గా పూలతో వెల్‌కమ్ చెప్పారు. ఇదిలా ఉంటే.. వరుణ్-లావణ్య రిసెప్షన్ హైదరాబాద్ ఎన్. కన్వెషన్ హాల్ మాదాపూర్‌లో నవంబర్ 5న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, క్రీడాకారులు హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే రిసెప్షన్‌లో వరుణ్ బ్లాక్ డ్రెస్ ధరించగా.. లావణ్య చీర కట్టుకుని పాపిట్లో కుంకుమ పెట్టుకుని తెలుగింటి కోడలిగా కనిపించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. సాధారణంగా చాలా మంది రిసెప్షన్‌కు మెడ్రన్‌గా రెడీ అవుతారు. కానీ మెగా కోడలు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించింది. దీంతో అది చూసిన మెగా ఫ్యాన్స్ లావణ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు.