Varshini Sounderajan: షాప్ ఓపెనింగ్ లో వర్షిణి.. నెయిల్ ఆర్ట్ గురించి షాకింగ్ కామెంట్స్..

by Prasanna |
Varshini Sounderajan: షాప్ ఓపెనింగ్ లో వర్షిణి.. నెయిల్ ఆర్ట్ గురించి షాకింగ్ కామెంట్స్..
X

దిశ, సినిమా : టీవీ షోలతో పాపులర్ అయినా యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో చేస్తూ నటిగా తనకంటూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం, మూవీస్ లో ఛాన్స్ ల కోసం హాట్ ఫోటో షూట్స్ కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

తాజాగా వర్షిణి ఓ షాప్ ఓపెనింగ్ లో సందడీ చేసింది. సెలూన్ రంగంలో ఉన్న న్యాచురల్స్ బ్రాండ్ నెయిల్స్ వారు కొత్త బ్రాంచ్ ని హైదరాబాద్లోని కూకట్ పల్లిలోని ప్రారంభించారు. ఈ షాప్ ని నటి వర్షిణి చేతుల మీదుగా ఓపెన్ చేసారు. ఆ తర్వాత ఆమె గోర్లకి నెయిల్ ఆర్ట్ వేపించుకుని తెగ మురిసిపోయింది. అయితే, ఈ సందర్భంగా వర్షిణి మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వర్షిణి మాట్లాడుతూ.. " అమ్మాయిలకి నెయిల్స్ అంటే చాలా ఇష్టం వారు తమ గోర్ల మీద ప్రత్యేక శ్రద్ద చూపుతారు. కొందరైతే గోర్లు విరిగిపోయిన చాలా ఫీల్ అవుతుంటారు. ఈవెంట్ సమయంలో నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసా.. ఆమె చూడటానికి పిచ్చి దానిలా ఉంది. ఆమె చేతి వేళ్ళపై నెయిల్ ఆర్ట్ చూసి షాక్ అయ్యాను. ప్రస్తుతం, ఈ నెయిల్ ఆర్ట్ కు చాలా మంచి డిమాండ్ ఉంది. అందరి లాగే నేను నా గోర్లని ఇష్టపడతాను" అని ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed