అర్ధనగ్నంగా పోజులిస్తూనే.. నెటిజన్లపై బోల్డ్ బ్యూటీ ఆగ్రహం

by Hamsa |   ( Updated:2023-05-19 06:34:19.0  )
అర్ధనగ్నంగా పోజులిస్తూనే.. నెటిజన్లపై బోల్డ్ బ్యూటీ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావేద్.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి నటన కంటే బోల్డ్‌ డ్రెస్సింగ్‌తోనే ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇక హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. బోల్డ్‌ షూట్‌ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. తాజాగా, ఇటీవల ముంబైలో జరిగిన 'నాచ్ బేబీ' పాట కార్యక్రమానికి అర్ధనగ్నంగా ఓ గ్రీన్ కలర్ డ్రెస్‌లో హాజరయ్యారు. ఆమె ఫ్యాషన్ దుస్తులతో బ్యాక్‌ అందాలను చూపిస్తూ మరోసారి రెచ్చపోయి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. అయితే ఆమె ఈవెంట్‌లో ఫొటో కోసం పోజులిస్తుండగా, కోపంతో అరవడం ప్రారంభించింది.

తన బట్టలపై చెడుగా మాట్లాడినందుకు నెటిజన్లపై విరుచుకుపడింది. "అబ్బాయిలు నేను దీని కోసం రావడం లేదు. మీరు కామెంట్లు చేయాలనుకుంటే వెళ్లి మీ తల్లి, సోదరి, గర్ల్‌ఫ్రెండ్ బట్టల మీద కామెంట్లు చేయండి. కానీ, నా దుస్తులపై ఈ రోజు నుంచి ఎవ్వరూ కామెంట్లు చేయోద్దు. నేను మీకు చాలా గౌరవం ఇస్తున్నాను. ఇదే నేను తిరిగి పొందుతున్నాను. అంటూ ఫై ర్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన కొంత మంది నెటిజన్లు రకరకాలుగా బోల్డ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.

Advertisement

Next Story