Mega Princess కు ఘనస్వాగతం.. అందరికీ థాంక్యూ చెప్తూ కూతురు ఫొటో షేర్ చేసిన Upasana

by Hamsa |   ( Updated:2023-06-25 14:51:26.0  )
Mega Princess కు ఘనస్వాగతం.. అందరికీ థాంక్యూ చెప్తూ కూతురు ఫొటో షేర్ చేసిన Upasana
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసనలకు జూన్ 20న తల్లిదండ్రులయ్యారు. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే తల్లీబిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండటంతో జూన్ 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మెగాప్రిన్సెస్‌కు ఫ్యామిలీ వారు ఘనస్వాగతం పలుకుతూ ఇంటిని పువ్వులు, బెలూన్లతో అలంకరించారు. అంతూకాకుండా వెల్‌కమ్ హోమ్ బేబీ అంటూ తమ ఇంటికి లక్ష్మీదేవికి స్వాగతం పలికారు. తాజాగా, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఉపాసన తన కూతురిని ఎత్తుకోగా చరణ్ తన పెంపుడు కుక్క పిల్లను చేతుల్లోకి తీసుకున్న ఫొటోను పెట్టింది. అంతేకాకుండా ‘‘ మా చిట్టితల్లికి లభించిన ఘనస్వాగతం మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. మాపై ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని క్యాప్షన్ ఇచ్చింది.

Click Here For Instagram link

Advertisement

Next Story