- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్ పెళ్లిలో ఘోరంగా హర్ట్ అయిన ఉపాసన..
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో చిరు ఫ్యామిలితో పాటుగా ఉపాసన కూడా అన్ని దగ్గరుండి చూసుకుంది. ఓ వైపు కూతురు క్లింకారా బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాల్లో కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా ఉపాసన వరుణ్ తేజ్ మ్యారేజ్ లో ఘోరంగా హర్ట్ అయినట్లుగా ఒక వార్త వినిపిస్తుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే..ఉపాసన, రామ్ చరణ్ లకి కూతురు పుట్టడంతోనే చాలామంది నెటిజన్స్ అల్లు అర్జున్ కి కోడలు పుట్టిందని, అల్లు అయాన్ కి కాబోయే భార్య క్లింకారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. కానీ అలా అనడం ఉపాసనకు ఏమాత్రం నచ్చలేదట. ఇదే విషయం వరుణ్ పెళ్లిలో కూడా వినపడటంతో ఉపాసన తన అత్తగారు సురేఖతో మాట్లాడుతూ.. ‘చిన్నపిల్లలను చూసి ఇప్పటికే వారి జంట బాగుంది, పెద్దయ్యాక పెళ్లి చేయాలని అప్పుడే మాట్లాడుతున్నారు. వీరిద్దరివి ఇప్పుడు పసి మనసులు.. వారు పెద్దయ్యాక ఎవరి మనసు ఎలా ఉంటుందో మనం ఊహించలేం. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడడం ఏం బాలేదు అత్తయ్య’ అని చెప్పిందట. ఇక ఉపాసన మాటలకు సురేఖ.. ‘బంధువులు అలాగే అంటారు వారి మాటలు పట్టించుకోవద్దు’ అని సర్దిచెప్పిందట. కానీ ఉపాసన మాత్రం ఆ విషయాన్ని తలుచుకొని పెళ్లిలో కాస్త డల్ గా ఉందట. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
Read More..
బ్లాక్ డ్రెస్‌తో ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చిన పవన్ కల్యాణ్.. హంగ్రీ చీతా అంటూ నెట్టింట ఫ్యాన్స్ రచ్చ