Unstoppable With NBK S2: NBK X PSPK Part 1 PROMO

by Prasanna |   ( Updated:2023-10-02 09:14:06.0  )
Unstoppable With NBK S2: NBK X PSPK Part 1 PROMO
X

దిశ, సినిమా: దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' టాక్ షో, టైటిల్‌కు తగ్గట్టుగానే మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది . ఇక తాజాగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌ పార్ట్‌-1 ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌. ఈ ప్రోమోలో పవర్ స్టార్‌ను బాలయ్య చాలా ప్రశ్నలు వేశాడు. అందులో 'ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా?' అని బాలయ్య అడుగుతాడు. 'నా విజ్ఞత, సంస్కారం దాన్ని ఆపేస్తుంది' అని పవన్‌ కల్యాణ్‌ అన్నాడు. అప్పుడు వెంటను బాలయ్య బాబు 'తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన పవన్‌ కల్యాణ్‌ పవర్ స్టార్ ఎలా అయ్యాడు' అని అడుగుతాడు. అప్పుడు పవన్‌ కల్యాణ్‌ 'అన్నయ్య రూమ్‌లోని పిస్తోల్ పట్టుకొని వెళ్లి' అని అంటున్నాడు. అలా ప్రోమో సస్పెన్స్‌లో పెట్టారు మేకర్స్. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ ఆ తర్వాత ఏం చెప్పాడు? అసలు ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ కోసం వెచిచూడాలి. ఇక ఈ ఎపిసోడ్‌లో పవన్‌ కల్యాణ్‌తో పాటు సాయిధరమ్‌ తేజ్‌ కూడా జాయిన్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి: సింగర్ మంగ్లీ ఒక్కో పాట ఎంత తీసుకుంటుందో తెలుసా ?

Advertisement

Next Story