అన్ స్టాపబుల్-2 ప్రోమోలో ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ

by samatah |   ( Updated:2022-12-17 14:17:45.0  )
అన్ స్టాపబుల్-2 ప్రోమోలో ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలయ్య హోస్ట్‌గా చేస్తోన్న అన్ స్టాపబుల్-2లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షో ప్రోమో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను 'ఆహా' విడుదల చేసింది. ఈ ప్రోమోలో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్‌లు డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. దీంతో మొత్తం ఎపిసోడ్ ఎప్పుడప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని కల్లలో ఒత్తులేసుకొని అభిమానులు ఎదురుచూస్తు్న్నారు. కాగా, ఈ ప్రోమోలో ప్రభాస్‌ పెళ్లి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే షోలో.. అరే ఓరే అనుకుంటూ ప్రభాస్-గోపీచంద్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇద్దరూ ఎంతో ఫ్రెండ్లీగా షోను కొనసాగించారు. అంతేకాదు, షో మధ్యలో రామ్ చరణ్ ఫోన్ చేసి ప్రభాస్ సీక్రెట్ ఒకటి బయటపెట్టగా రేయ్ చరణ్.. నువ్వు నా ఫ్రెండువా, శత్రువువా! అంటూ చిరుకోపం ప్రదర్శించారు.


Advertisement

Next Story