- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Adipurush’పై దేశవ్యాప్తంగా నిరసనలు.. స్పందించిన సెంట్రల్ మినిస్టర్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభాస్ నటించిన 'ఆది పురుష్' మూవీని వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉన్నాయని, శ్రీరాముడు, సీతామాత, హనుమంతుడి పాత్రలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ జాతీయ స్థాయిలో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పలు హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. అసంబద్ధ డైలాగులతో పవిత్ర భావాలను వక్రీకరించారని అందువల్ల ఈ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ అఖిల భారత హిందూ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సినిమాను జాతీయ స్థాయిలో బ్యాన్ చేయాలంటూ కశ్మీర్ టు కన్యాకుమారి వరకు పలు చోట్ల సోమవారం నిరసనలు వ్యక్తం అయ్యాయి.
మరోవైపు సినిమాలో ఉన్న అభ్యంతరకర డైలాగులను మార్చుతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించగా ఎలాంటి మార్పులు లేకుండానే మూవీని ప్రదర్శించారని ఆరోపిస్తూ ఇవాళ ముంబైలో కొంత మంది యువకులు థియేటర్‌లో సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. కాగా ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తొలిసారి స్పందించారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడాన్ని తాము అంగీకరించబోమన్నారు. అటువంటి చర్యలకు తాము ఎప్పుడు వ్యతిరేకమని తెలియజేశారు. అభ్యంతరకరమైన డైలాగులను మారుస్తామని చిత్ర బృందం ప్రకటించిందని దానిని తాను పర్యవేక్షిస్తానని వెల్లడించారు. మరోవైపు తన ప్రాణాలకు హాని ఉందని ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు.
Also Read...