Director Shankar : శంకర్ దర్శకత్వంలో.. తమిళ హీరో విజయ్, షారుఖ్ మూవీ!

by Prasanna |   ( Updated:2023-02-10 08:38:25.0  )
Director Shankar : శంకర్ దర్శకత్వంలో.. తమిళ హీరో విజయ్, షారుఖ్ మూవీ!
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్స్‌లో తమిళ హీరో విజయ్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా ఉంటారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న వీరిద్దరి కాంబినేషన్‌లో డైరెక్టర్ శంకర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అండర్ వాటర్‌లో నడిచే సైన్స్ ఫిక్షన్ ఫిలిం అని తెలుస్తుండగా.. రూ.900 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. రెండు ఫేమస్ ప్రోడక్షన్ హౌజ్‌లు సినిమాను నిర్మించనున్నట్లు టాక్. కాగా ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే మూవీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story