Martin: అన్‌కాంప్రమైజ్డ్‌గా ‘మార్టిన్’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న విజువల్స్!

by sudharani |
Martin: అన్‌కాంప్రమైజ్డ్‌గా ‘మార్టిన్’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
X

దిశ, సినిమా: ధృవ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్టిన్’. భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ముంబైలో జరిగిన ఈ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు ఇండియాలోని టాప్ క్రిటిక్స్‌, జర్నలిస్టులు హాజ‌ర‌య్యారు. ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా, స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో ప్రపంచ వేదికపై భారతీయ చిత్రాలకు సంబంధించిన‌ కొత్త కోణాలను, అవకాశాలను అద్భుతంగా హైలైట్ చేస్తూ ప్రద‌ర్శించారు.

‘మార్టిన్’ సినిమా గురించి చెప్పాలంటే మూవీ ట్రైలర్ అద్భుతంగా ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంది. భ‌విష్యత్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా సినిమాను రూపొందించిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే అర్థమ‌వుతుంది. ఇండియ‌న్ సినిమా ఎంత గొప్ప సినిమాల‌ను రూపొందిస్తుంద‌నే విష‌యాన్ని ప్రపంచానికి తెలియ‌జేయ‌ట‌మే ముఖ్య కారణంగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఇంత గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేసినట్లు చెప్పారు చిత్ర బృందం. అంతే కాకుండా నిర్మాత‌లు అన్‌కాంప్రమైజ్డ్‌గా అంత‌ర్జాతీయ సినీ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకునేలా సినిమాను నిర్మించార‌నే విష‌యాన్ని స్పష్టం చేయ‌ట‌మే ఈ వేడుక ఉద్దేశమని కూడా తెలిపారు. కాగా.. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా హాజరయ్యారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story