- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య చేసిన పనిని బయట పెట్టి.. షోలో వెక్కి వెక్కి ఏడ్చిన ఉదయభాను!
దిశ, సినిమా : నటి, యాంకర్ ఉదయభాను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజుల్లో ఈమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. కొన్ని సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించింది కానీ, ఈ నటికి తర్వాత అంతగా ఆఫర్స్ అనేవి రాలేదు. దీంతో ఈమె యాంకరింగ్‌పై దృష్టి పెట్టింది. ఢీ షో, రేలా రే రేలా, డాన్సింగ్ స్టార్, నువ్వు నేను, జానవులే నెర జానవులో, నీతోనే డ్యాన్స్, చాంగురే బంగారు లేడీ, ఇలా చాలా షోలు చేసి సుమకి గట్టి పోటీనిచ్చింది. అంతే కాకుండా ఎన్నో సినిమా ఈవెంట్స్‌లో కూడా ఈమె పాల్గొని సందడి చేసింది. అయితే తాజాగా ఉదయభాను బాలకృష్ణ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. నీతోనే డ్యాన్స్ షోలో ఆమె తన జీవితంలోని చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ కన్నీరు పెట్టుకుంది. నేను నా కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాను. నా దగ్గర్నుంచి ప్రతి బిడ్డని కొందరు దూరం చేసేశారు.ఫైనల్‌గా నాకంటూ ఇద్దరు బిడ్డలను ఇచ్చాడు దేవుడు.
అయితే నాకంటూ ఓ కుటుంబం లేదు, నేను చిత్ర పరిశ్రమే నా కుటుంబం అనుకొని కొంత మందికి కాల్ చేసి నా మొదటి బిడ్డ పుట్టిన రోజు మీరు రండి అంటూ కాల్ చేశాను. కానీ దానికి ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. చాలా బాధేసింది. కానీ చివరగా నేను బాలయ్యగారికి మెసేజ్ చేశాను. నా బిడ్డ మొదటి పుట్టిన రోజు, నా జీవితంలో నాకు ఇదే మొదటి పెద్ద పండుగా.. మీరు వస్తారని ఆశిస్తున్నాను, వస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అంటూ చెప్పాను. నాకు ఎవరి నుంచి రిప్లే రాలేదు కానీ, బాల కృష్ణ నుంచి అర్ధగంట తర్వాత కాల్ వచ్చింది. ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. నాకు ఆ రోజు దేవుడు కనిపించాడు అనిపించింది. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.