ప్రియుడితో బుల్లితెర నటి వర్ష ఎంగేజ్‌మెంట్.. వైరల్ అవుతున్న ఫొటోలు

by Hamsa |
ప్రియుడితో బుల్లితెర నటి వర్ష ఎంగేజ్‌మెంట్.. వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, సినిమా: బుల్లితెర నటి హెచ్‌కే వర్ష శాండల్‌వుడ్‌లో పలు సీరియల్స్ చేసింది. ఈ అమ్మడు ప్రజెంట్ తెలుగులో ప్రేమ ఎంత మధురం సీరియల్ చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది. తాజాగా, వర్ష తన ప్రియుడు కౌశిక్ నాయుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

అయితే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న వర్ష, కౌశిక్ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేశారు. దీంతో అవి చూసిన నెటిజన్లు వర్షకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. ఈ అమ్మడు సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది.

Advertisement

Next Story

Most Viewed