- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్, ఎమోషన్‍తో ఆకట్టుకుంటున్న ‘ట్రూ లవర్’ మూవీ ట్రైలర్
దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో మంచి లవ్ కంటెంట్ తో ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చిన ‘ బేబి ’ మూవీ, రీసెంట్ ‘Joy’ మూవీ మంచి హిట్ లు అందుకున్నాయి. అయితే ఇందులో భాగంగా తాజాగా రాబోతున్న చిత్రం ‘ట్రూ లవర్’. తమిళ నటుడు మణికందన్, శ్రీ గౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
దీంతో ప్రకటనలో భాగంగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే గత ఆరు సంవత్సరాలుగా ఇద్దరు లవర్స్ మధ్య ప్రేమ తరచూ గొడవలు.. మళ్లీ కలుసుకోవడం వంటివి చూపించారు. అయితే హీరో అరుణ్‍కు పెద్దగా డబ్బు ఉండదు. ప్రేమ గురించి ఇంట్లో చెప్పేందుకు, పెళ్లి చేసుకునేందుకు మరింత సమయం కావాలని దివ్య అడుగుతుంటుంది. దీంతో అరుణ్ కోప్పడుతుంటాడు. “డబ్బుకే రెస్పెక్ట్ ఇక్కడ. ఈ లవ్ బొక్కా ఇవన్నీ టైమ్ పాసే” అని అరుణ్ డైలాగ్ ఉంది. అలా అరుణ్ ప్రవర్తనతో దివ్య చాలాసార్లు బాధ పడుతుంది. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే క్లాసిక్ లవ్ స్టోరీ గా ఉంది. పూర్తి కథ తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే.