Devara: ‘దేవర’ సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిర్మాత (పోస్ట్)

by sudharani |
Devara: ‘దేవర’ సాంగ్‌పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిర్మాత (పోస్ట్)
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రొమాంటిక్ సాంగ్‌లో జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయింది. అంతే కాకుండా సాంగ్ రిలీజైనా 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది.

కానీ విజువల్స్, మ్యూజిక్ విషయంలో ప్రజెంట్ సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ జరగుతున్నాయి. ముఖ్యంగా ఈ పాటకు సంగీతం అందించిన అనిరుధ్ కాపీ పేస్ట్ చేశాడనే విమర్శలు వినిపించడంతో పాటు.. ఈ పాట లిరిల్ సోప్ యాడ్ లాగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన షాట్స్‌ను కట్ చేసి మీమ్స్ రూపంలో వైరల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై ‘దేవర’ నిర్మాత నాగవంశీ స్పందించాడు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్ వస్తున్నాయి. ఆఫీషియల్ ఈ సాంగ్ జోష్ ఎలా ఉంది బాయ్స్? ఇందులో తారక్ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కద బాయ్స్..’ అంటూ ట్రోల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు నాగవంశీ. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

Advertisement

Next Story