''భార్యను పక్కన పెట్టుకుని వేరే అమ్మాయితో ఏంటా పని''.. అల్లు అర్జున్‌పై ట్రోల్స్

by sudharani |   ( Updated:2022-08-23 05:40:59.0  )
భార్యను పక్కన పెట్టుకుని వేరే అమ్మాయితో ఏంటా పని.. అల్లు అర్జున్‌పై ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. భార్య స్నేహారెడ్డితో కలిసి న్యూయార్క్‌లో 'తెలుగు ఖ్యాతిని పెంచడానికి ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో' పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో అందరు బన్నీని పలకరిస్తూ ఉండగా.. ఇంతలో అక్కడికి మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు కూడా వచ్చారు. ఆమె బన్నీని చూసి హాయ్ అని పలకరించింది. దీంతో బన్నీ కూడా తన వైపు తిరిగి పలకరించి మాట్లాడాడు.

అయితే, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పక్కకు తిరిగి అలిగినట్టుగా నిలబడింది. ఇంకేముంది.. స్నేహారెడ్డి నిజంగా బన్నీ మీదా అలిగిందో లేదో తెలియదు కానీ, ఈ ఫొటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడిమాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ ''పక్కన భార్యను పెట్టుకుని ఏంటా పనులు'' అంటూ కొంత మంది కామెంట్స్ పెడితే.. ''ఒరేయ్ ఆపండ్రా బాబు.. అక్కడ ఏమి లేదు.. ఆమె మర్యాద పూర్వకంగా పలకరించింది.. బన్నీ కూడా హాయ్ చెప్పాడు. దాన్ని పెద్ద ట్రోల్స్ చేస్తూన్నారంటూ'' రకరకాలు కామెంట్స్ పెడుతున్నారు.

వ్యాపారంలో లాభం రావాలని అందరి ముందు భార్యను ఏం చేశాడో తెలుసా?

Advertisement

Next Story