త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు ఏమి కాదు.. కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2023-11-10 09:59:53.0  )
త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు ఏమి కాదు.. కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాల్లో విలన్ క్యారెక్టర్‌లో నటించి ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏ పాత్ర అయినా సరే లీనమై వందశాతం నటనతో న్యాయం చేస్తారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఆయన చనిపోయారంటూ ఇటీవల పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాటిపై కోటా స్పందించి నేను ఆరోగ్యంగా ఉన్నాను చనిపోలేదు అని చెప్పారు.

తాజాగా, ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు టాలీవుడ్ డైరెక్టర్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ ఒకప్పుడు దర్శకుల ప్రతిభ ఎంతో అద్భుతంగా ఉండేది. వారిలో ఉన్నటువంటి ఈ ప్రతిభ చూసి ఎంతో ఆశ్చర్యం కలిగేది. ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లలో అలాంటి ప్రతిభ నాకు ఏ మాత్రం కనిపించలేదు. రాజమౌళి నాకు చాలా గొప్ప దర్శకుడు అనే భావన కలుగుతుంది. ఆయనలో చాలా ప్రతిభ దాగి ఉంది. చాలా మంది త్రివిక్రమ్ గొప్ప డైరెక్టర్ అని చెబుతూ ఉంటారు. నాకైతే ఆయన పెద్ద గొప్పవాడు అనిపించదు’’ అని చెప్పుకొచ్చారు. అయితే కోటా శ్రీనివాసరావు స్టార్ డైరెక్టర్లు, హీరోయిన్లు, హీరోలపై కామెంట్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఎంతో మంది పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story