- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోయిన్ త్రిష చాలా ఇంటెలిజెంట్.. దానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ..
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అందరి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ‘పొన్నియన్ సెల్వన్’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘విశ్వంభర’, ‘థగ్ లైఫ్’, ‘విదాముమార్చి’ వంటి భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..? ఒకానొక సమయంలో త్రిష సినిమాల్లో అవకాశాలు లేక ఉంటున్న సమయంలో ఆమెకు ఓ రోజు ఓ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మంచి కథ ఉంది. మీరే హీరోయిన్ ఓకే అయితే ఇప్పుడే ముంబైకి బయలుదేరి వచ్చేయండి అని ఆఫర్ చేశారట. ఇక అప్పటికే సినిమాలు లేక ఎదురు చూస్తున్న త్రిష ఓ నిమిషం కూడా ఆలోచించకుండా ముంబైకి ఫ్లైట్‌లో వెళ్లిందట.
ఇక నిర్మాతని కలిసాక పాట్నాలో మన డైరెక్టర్ ఉన్నారు. అక్కడికి వెళ్లి స్టోరీ రెమ్యూనరేషన్ మాట్లాడుకుందాం అని చెప్పగానే నమ్మిన త్రిష వెంటనే ప్రొడ్యూసర్‌తో పాట్నాకి వెళ్లి అక్కడ ఓ హోటల్ రూమ్‌లో ముగ్గురు భోజ్పురి సినిమా కథ, రెమ్యూనరేషన్ చర్చించుకున్నారట. అది అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఇక్కడ ఒక బీర్ చాలా స్పెషల్ తీసుకురావాలా అని అడిగారంట. అలా అడిగేసరికి డౌట్ వచ్చిన త్రిష వెంటనే నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి బయటకు వచ్చేసిందంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.