ఆ స్టార్ హీరోతో కమిటైన త్రిష.. ఆ ఒక్కపని చేసినందుకు ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందా?

by Anjali |   ( Updated:2024-03-05 09:58:49.0  )
ఆ స్టార్ హీరోతో కమిటైన త్రిష.. ఆ ఒక్కపని చేసినందుకు ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందా?
X

దిశ, సినిమా: అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగొందింది హీరోయిన్ త్రిష. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రవితేజ వంటి హీరోలతో జోడి కట్టి.. తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతుంది. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాలో విజయ్ సరసన నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం త్రిష చేతిలో ఏకంగా ఆరేడు ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే త్రిష కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. స్టార్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు నెట్టింట ఏ రేంజ్ లో దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

మెగాస్టార్ చిరంజీవి, మీనా, ఖుష్బూ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు మన్సూర్ నీచమైన కామెంట్స్ ను ఖండించి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇష్యూ చివరకు హైకోర్టు కు కూడా ఎక్కింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ గురించి నెట్టింట మరో వార్త హల్ చల్ చేస్తుంది. త్రిష ఓ స్టార్ హీరో దగ్గర ఏకంగా ఐదు కోట్ల రూపాయలు తీసుకుందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు. త్రిష టాలీవుడ్ కు వచ్చిన మొదట్లో ఓ బడా ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందట.

అయితే సదరు హీరో ఈ హీరోయిన్ ను కాకుండా మరో కథానాయికను సెలక్ట్ చేసుకోవాలనుకున్నాడట. త్రిషను ఈ రోల్ నుంచి తప్పించడానికి ఆ హీరో త్రిషకు ఏకంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చాడట. త్రిష కూడా ఇష్టపూర్వకంగానే మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇద్దరి కమిట్ మెంట్‌తోనే ఈ ఇష్యూను సాల్వ్ చేసుకున్నారట. దీంతో ఈ న్యూస్ ఇంతవరకు బయటకు రాలేదట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. త్రిష డబ్బుకు ఆశపడి బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More..

బీజేపీ ఎంపీ రాసలీలలు బట్టబయలు.. ప్లీజ్ ఆ న్యూడ్ వీడియో లింక్ పంపించండి! నటి కస్తూరి పోస్ట్ వైరల్

Advertisement

Next Story