- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adipurush: ట్రెండింగ్‌లో #om raut.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ బాయ్‌కాట్ చేయాలంటూ ట్వీట్స్
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో మహాకావ్యం రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాలతో జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే అందులోని పాత్రలను మోడ్రనైస్ చేసి ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా తీయడంతో ప్రేక్షకులు మండిపడుతున్నారు.
‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్‌ను నెటిజన్లు ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో #OMRAUT అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తూ ప్రభాస్ లాంటి స్టార్‌ను సరిగ్గా వినియోగించలేదని ఆడుకుంటున్నారు. అంతేకాకుండా రూ. 500 కోట్లతో కార్టూన్ సినిమా తీశారని ఓం రౌత్‌పై ఫైర్ అవుతున్నారు. అలాగే ఇలాంటి సినిమాలను తీసి యువ తరాన్ని నాశనం చేయొద్దని ఆదిపురుష్‌ను బాయ్‌కాట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఖైదీని పైకి కట్టేసి థర్డ్ డిగ్రీ ఇస్తున్న వీడియోను షేర్ చేసి ఓంరౌత్‌కు కూడా ఇలాంటి పనిష్‌మెంట్ ఇవ్వాలని ట్వీట్స్ చేస్తున్నారు.